చంద్రబాబు, జగన్‌లపై చిరంజీవి: వైయస్‌పై బాలయ్య

Chiranjeevi - Balakrishna
ఏలూరు/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చిరంజీవి వారిపై నిప్పులు చెరిగారు. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిన నేతలు జైలు పాలయ్యారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. పార్టీ సెంటిమెంటును అడ్డుపెట్టుకొని జగన్ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రతో ఆయాసం, కాళ్ల నొప్పులు తప్ప అధికారం రాదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎప్పుడు రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ప్రజల కోసం పాదయాత్ర అనడం హాస్యాస్పదమన్నారు. యాత్ర చేస్తున్న బాబుకు ఎండమావే తప్ప జీవితంలో అధికారంలోకి రాడని మండిపడ్డారు.

రాష్ట్రంలోని సమస్యలపై ప్రతిపక్షాలు మాయమాటలు చెబుతున్నాయన్నారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన పాదయాత్రం సందర్భంగా ప్రతి కులానికి ఓట్ల కోసం డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నారన్నారు. పాదయాత్రతో అధికారం రాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు.

వస్తున్నా.. బాలకృష్ణ

మూడు దశాబ్దాల పాటు నటుడిగా తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, తాను త్వరలో పూర్తిస్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, సినిమాల్లో వలె రాజకీయాల్లోని ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభానికి కారణమన్నారు. టిడిపి హయాంలోనే ప్రజలందరికి అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. త్వరలో రాజకీయాల్లో కీలక బాధ్యతలు తీసుకుంటానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. బాలయ్య కృష్ణా జిల్లా తిరువూరులో పర్యటిస్తున్నారు.

చిరుకు మంచి పోస్ట్

2014లో కాంగ్రెసు పార్టీని మళ్లీ గెలిపిస్తే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి మరింత మంచి పదవి వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఆదివారం అన్నారు. ఆవులా పాలిచ్చే పార్టీనే ప్రజలు నమ్మాలని కోరారు. గాడిదలా వెనుక నుండి తన్నే పార్టీలను నమ్మవద్దన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నీటి బుడగ వంటిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+