గర్ల్స్‌కి లైంగిక వేధింపులు: ఫోన్లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్

Man arrested for allegedly harassing girls
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడు బాలికలను టార్గెట్‌గా చేసుకొని వారిని వేధింపులకు గురి చేస్తున్నాడు. బాలికలను వేధిస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విజయవాడ రూరల్‌లోని ఎనికెపాడు పౌండ్రీలో పని చేస్తున్న రాజు అనే వ్యక్తి తన కూతురు వయస్సున్న బాలికలను టార్గెట్‌గా చేసుకొని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు.

రెండు రోజుల క్రితం ఓ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసింది. బాలికను అడగడంతో అసలు విషయం చెప్పింది. తనకు చాక్లెట్ ఇస్తానని చెప్పి అతను తనను వేధించాడని తెలిపింది. ఎవరికైనా చెబితే బాగుండదని బెదిరించాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, ఇతర గ్రామస్తులు రాజును నిలదీసి చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

గత మూడేళ్లుగా నిందితుడు పలువురి బాలికలను లైంగికంగా వేధించినట్లు చెబుతున్నారు. వారిని భయపెట్టి, బెదిరించి లైంగికంగా వేధించేవాడు. వాటిని సెల్ ఫోన్‌లో చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో అటువైపు వెళ్లేందుకు బాలికలు భయపడేవారు. గ్రామస్తులు నిలదీయండంతో రాజు తప్పును అంగీకరించాడు. అతనికి ఇరవయ్యేళ్ల కొడుకు, పద్దెనిమిదేళ్ల కూతురు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను మూడు నాలుగేళ్లుగా అక్కడే పని చేస్తున్నాడు. పోలీసులు అతని నుండి ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లాలో...

వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఓ అంధ విద్యార్థినుల వసతి గృహంలో నిర్వాహకురాలి భర్త బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఈ వసతి గృహాన్ని ఓ మహిళ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త బాలికలను వేధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+