శంషాబాద్ ఏర్ పోర్టులో రెండు గన్స్, బుల్లెట్లు స్వాధీనం

కానిస్టేబుల్ ఆత్మహత్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
విశాఖపట్నం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భీమిలి సమీపంలోని అతిపురాతన నరసింహ స్వామి వారి ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు.
వ్యక్తి హత్య
కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications