హోటల్ నుంచి అంజలి ఒక్కరే బయటకు వెళ్లారా?
హైదరాబాద్: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫేమ్ అంజలి అదృశ్యం మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యంపై సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పిన్ని భారతీదేవిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, అంజలి తాను బస చేసిన దసపలా హోటల్‌ను అంజలి ఒక్కరే బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమె ఒక్కరే బయటకు వెళ్తున్న దృశ్యాలు సిసిటివీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
పివిపి వెంచర్స్ సినిమా బలుపు సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి అంజలి హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆమె కోసం గత నెల 30వ తేదీన మెయిల్ ద్వారా దస్‌పల్లా హోటల్‌లో పివిపి వెంచర్స్ గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. తన బాబాయ్ సూరిబాబుతో కలిసి గత నెల 31వ తేదీ సాయంత్రం మూడున్నర గంటలకు అంజలి హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌కు చేరుకున్నట్లు సమాచారం.
ఆమె దస్‌పల్లా హోటల్‌లోని 307 గదిలో బస చేసినట్లు, అక్కడి నుంచే ఆమె కనిపించకుండా పోయినట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ హోటల్ నుంచే బలుపు సినిమా షూటింగ్‌కు వెళ్లి వస్తుండేవారని అంటున్నారు. సోమవారం బయటకు వెళ్లిన అంజలి తిరిగి రాకపోవడంతో సూరిబాబు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.

తన పిన్ని భారతీదేవిపై, దర్శకుడు కళంజియంపై అంజలి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను తీవ్రంగా హింసిస్తున్నారని ఆమె చెప్పింది. తనపై ఆరోపణలు చేసిన అంజలిపై కళంజియం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్ధతి మార్చుకోవాలని తాను అంజలికి సూచించినట్లు ఆయన తెలిపారు. తాను హింసించలేదని, తాను అంజలిని మందలించానని పిన్ని భారతీదేవి చెబుతున్నారు. భారతీదేవిపై, కళంజియంపై ఆరోపణలు చేసిన తర్వాత అంజలి కనిపించకుండా పోయారు. అమె ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది.












Click it and Unblock the Notifications