వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఫోటో: పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Daggupati Purandeswari
కర్నూలు/అనంతపురం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావును కాంగ్రెసు పాలు చెయ్యవద్దని ఎన్టీఆర్ తనయ, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి సోమవారం సూచించారు. ఎన్టీఆర్ కుమార్తెగా.. మీ ఇంట్లో ఆయన ఫొటోలు పెట్టుకోవచ్చునని, పూజించుకోవచ్చునని అన్నారు.

కానీ, ఆ మహానేత ఫొటోలను కాంగ్రెస్ నేతల చేతుల్లో పెట్టవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే అప్పట్లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లని కుక్క మూతి పిందెలు అని ఎన్టీఆర్ విమర్శించేవారని, అధికారం కోసం అలాంటి పార్టీలో చేరిన పురందేశ్వరిని ఏమనాలో ఆమే చెప్పాలని కోరారు.

ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొనే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి శనిగ్రహం లాంటిదని, ఎన్టీఆర్ మరణానికి ఆమే కారణమని విమర్శించారు. ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి రాకపోయి ఉంటే ప్రధాన మంత్రో, రాష్ట్రపతో అయ్యేవారన్నారు.

సబితాపై మేం విజయం సాధించాం.. పయ్యావుల

అవినీతిపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేయడం వల్లే మంత్రుల అవినీతి బాగోతాలు బయటపడ్డాయని, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కేసు నమోదు అందులోభాగమని టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులు అనేకసార్లు పోరాటాలు చేసిన విషయం గుర్తుచేశారు. సిబిఐ చార్జిషీట్‌లోని మంత్రులను బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు. కేబినెట్ నుంచి తొలగించి విచారణ చేపట్టాలని సీఎం, గవర్నర్‌లను కోరారు.

English summary

 Telugudesam Party senior leader and MLA KE Krishnamurthy has suggested Central Minister Daggupati Purandeswari over NTR photos issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X