చిరంజీవితో భేటీ వార్తలపై నటి ఖుష్బూ గుర్రు

ఆ వార్తలపై ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చిరంజీవిని కలిశానా వాట్ ఎ కామెడీ అని వ్యాఖ్యానించారు. తాను చిరంజీవితో భేటీ అయినట్లు, కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖుష్బూ కొట్టిపారేశారు.
ప్రస్తుతం డీఎంకేలో ఉన్నానని, అదే పార్టీలోనే కొనసాగుతానని ఖుష్బూ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖుష్బూ చెప్పారు. కాగా ఇటీవల డీఎంకే వారసత్వంపై ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
స్టాలిన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆయన వర్గానికి చెందిన డిఎంకె కార్యకర్తలు ఆమెపై దాడి చేశారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఖుష్బూ ఏదో రకంగా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications