జగన్ కేసులో మంత్రులు: సిబిఐపై జీవన్ రివర్స్ అటాక్

సిబిఐ దర్యాఫ్తు పేరుతో కాంగ్రెసు పార్టీని వేధిస్తోందని ఆయన బుధవారం మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలపడానికి తమ పార్టీకి చెందిన నేతలను వేధిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో బతకాలా? వద్దా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
సిబిఐ తన దర్యాఫ్తులను ఒక్కో కేసులో ఒక్కోరకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఓ రకంగా, ఇతర కేసుల్లో మరో రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను వేధిస్తున్నారని ఆయన అన్నారు.
మంత్రుల ప్రాసిక్యూషన్‌కు సిబిఐ కోరడం తగదన్నారు. ఈ విషయంలో కేంద్రం హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ నష్టపోతుందన్నారు.












Click it and Unblock the Notifications