సుప్రీంను సిబిఐ ఉల్లంఘించింది: జగన్ మెమో

YS Jagan
హైదరాబాద్: తన ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి దాఖలు చేసిన మెమోలాంటిదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోర్టులు బుధవారం దాఖలు చేశారు. దాల్మియా సిమెంట్స్‌పై దాఖలు చేసిన సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌నే తుది చార్జిషీట్‌గా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సిబిఐ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.

తన ఆస్తుల కేసులో ఒకే చార్జిషీట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయితే సిబిఐ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ వేర్వేరు చార్జిషీట్లను దాఖలు చేస్తోందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. అంశాలవారీగా చార్జిషీట్లు దాఖలు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.

దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారంపై తన కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై జగన్ ఆ మెమోను దాఖలు చేశారు. ఏడు అంశాలపై సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేస్తామని చెప్పిందని, అది సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడమేనని ఆయన అన్నారు. తన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒకే చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని జగన్ గుర్తు చేశారు.

ఇదిలావుంటే, విజయసాయిరెడ్డి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒకే చార్జిషీట్ దాఖలు చేయడానికి ప్రయత్నిస్తామని సిబిఐ సుప్రీంకోర్టు ముందు చెప్పిందే తప్ప హామీ ఇవ్వలేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దాల్మియా సిమెంట్స్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌నే తుది చార్జిషీట్‌గా పరిగణించాలని కోరుతూ వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+