వైయస్ దొంగ, పక్కన ఎన్టీఆరా: ఫ్లెక్సీలపై బాబు స్పందన

Chandrababu Naidu
కాకినాడ: కాంగ్రెస్ పార్టీపై చివరి వరకు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అనిస అలాంటి వ్యక్తి ఫొటోను అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైయస్ ఫొటో పక్కన పెడతారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసులమంతా దాన్ని గట్టిగా ఎదుర్కోవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముదిరిన 'ఫ్లెక్సీ'ల వివాదంపై మంగళవారం పాదయాత్రలో ఆయన స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన వైఎస్ లాంటి దొంగల ఫొటోపక్కన ఎన్టీఆర్ ఫొటో చూస్తే బాధేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దివాలాకోరు రాజకీయమని, రాజకీయాల్లో విలువలు పడిపోయాయని, మహాత్మాగాంధీ, జ్యోతీరావు ఫూలే , అంబేద్కర్, ఎన్టీఆర్..ఇలాంటి మహానుభావుల ఫొటోలు చూస్తే ఒక స్ఫూర్తి అని ఆయన అన్నారు.

వైయస్‌ను చూస్తే ఏం గుర్తుకొస్తుంది? లక్ష కోట్లు దోచాడని గుర్తుకొస్తుందని, ఎన్టీఆర్ చివరి వరకు కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేశారని, మనమంతా ఆయన వారసులమని ఆయన కార్యకర్తలతో అన్నారు. వైయస్ కుటుంబ అవినీతిపై ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేయాలని ఆయన అన్నారు. అప్పుడైనా వారికి సిగ్గు వస్తుందేమోనని ఆయన అన్నారు.

వైయస్ సీఎంగా వున్నపుడు ఆయన అరాచకాలపై సోనియా, మన్మోహన్‌సింగ్‌లు మౌనం వహించారని, దాని వల్లనే వైయస్ చెలరేగిపోయారని విమర్శించారు. విద్యుత్ సమస్యలపై టీడీపీ పిలుపునకు స్పందించి బంద్ విజయవంతం చేసిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సమస్యలు తీరేవరకు ఉద్యమం ఆగదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+