వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

420 నెంబర్ ఇవ్వాలి: కిరణ్ కేబినెట్‌పై రేవంత్ ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రులకు ముఖ్యమంత్రి సారథిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులపై 420 కేసులు నమోదవుతున్నాయన్నారు.

డయల్ యువర్ కేబినెట్‌కు 420 నెంబర్ కేటాయించాలని ఆయన ఎద్దేవా చేశారు. సచివాలయంలోని సమతా బ్లాక్‌ను జైలుగా మార్చాలని ఆయన విమర్శలు గుప్పించారు. 420 మంత్రులను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అధికారంలో కొనసాగే హక్కు లేదు

నిర్భయ బిల్లు వచ్చినప్పటికీ మహిళలపై అరాచకాలు ఆగడం లేదని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదని ఆయన అన్నారు.

దాడులకు బాధ్యత వహిస్తూ సబిత రాజీనామా చేయాలి

రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి గురువారం అన్నారు. మహిళలపై దాడులకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆదుకుంటామని... జగన్ పార్టీ

అమ్మహస్తం పేరుతో ప్రజలను ఆదుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శించింది. ఈ రోజు కిరణ్ ప్రవేశ పెట్టిన అమ్మహస్తంపై ఆ పార్టీ మండిపడింది. ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోందన్నారు. ప్రభుత్వం ధరలను ఐదువందల రెట్లు పెంచిందని ఆరోపించారు. రేషన్ సరుకులకు ప్రభుత్వం కోత పెడుతోందని ఆరోపణలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డిది ధరకాసుర పాలన అన్నారు.

English summary
Telugudesam Party senior leader Revanth Reddy has lashed out at Kiran Kumar Reddy's government for allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X