బాధితురాలే కి'లేడీ'!: రేప్ చేయకున్నా డబ్బు కోసమే..

అయితే యువతే వారిని గోవాకు విహార యాత్ర పేరుతో తీసుకు వెళ్లినట్లుగా తేలింది. ఇంతకుముందు కూడా ఇలాగే చేసిందని, డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తుందని కొన్ని ఆధారాలు లభించాయట. ఈమె హైదరాబాదు యువతి కాదు. బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఆమె తన పేరు మార్చుకొని హైదరాబాదులో ఆరేళ్లుగా ఉంటోంది. ఓ పోలీసు అధికారి కూతురుగా పరిచయం చేసుకొని పలు ప్రాంతాల్లో నివసించింది.
తండ్రితో ఉన్న విభేదాల కారణంగా వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నానని ఆమె చుట్టుపక్కల వారికి చెప్పింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న ఆ యువతి తెలివిగా పలువురిని మోసం చేస్తోందని తేలింది. హోటళ్లు, రెస్టారెంట్లలో యువకులను ఆకర్షించి వారితో స్నేహం చేసిన అనంతరం గోవా వంటి ప్రాంతాలకు విహార యాత్రకు తీసుకు వెళ్లడం, అక్కడ సరదాగా గడపడం చేస్తుండేది.
హైదరాబాద్ తిరిగి వచ్చాక అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆమె పథకం. కేసు నమోదు చేస్తానంటే మాత్రం వద్దని డబ్బులు ఇప్పిస్తే సర్దిపెట్టుకుంటానని చెబుతుంటుందట. అభియోగాలు ఎదుర్కొన్న వారు కూడా డబ్బులిచ్చి వదిలించుకోవడంతో అది సద్దుమణిగేది. ఇప్పుడు మాత్రం ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. ఐదేళ్లలో పలువురిని ఇలా మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేసిందట. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications