ఎన్టీఆర్, బాలయ్య టిడిపి కార్యకర్తలే: తారకరత్న

ఎన్టీ రామారావు రాజకీయ వారసుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి కార్యాలయాన్ని, వీధి దిపాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు నాయుడే అందరికీ ఏకైక నాయకుడని ఆయన అన్నారు.
తారకరత్న ప్రకటన చంద్రబాబు నాయుడికి కాస్తా ఊరట కలిగించినట్లే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ వివాదంలో బాలకృష్ణ తన వైపు నిలబడుతున్నప్పటికీ మిగతా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా బహిరంగంగా ముందుకు రాలేదు. తారకరత్న చేసిన ప్రకటనతో చంద్రబాబుకు కాస్తా బలం వచ్చినట్లేనని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ ఓవైపు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మరోవైపు నించున్నారు. ఈ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్లీల వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.












Click it and Unblock the Notifications