వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంపై కెసిఆర్ ఫైర్: కెవిపి అరెస్టుకు యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Madhu Yashki
మహబూబ్‌నగర్/ న్యూఢిల్లీ/ ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తెరాస వ్యతిరేకించిందని సిఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌లో తెరాసనే ఛాంపియన్ అని తేల్చిచెప్పారు. తాను తన నియోజకవర్గానికి రావడం లేదని ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని, మహబూబ్‌నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి ఏంచేశారని ఆయన అన్నారు.

అవినీతి మంత్రులను కిరణ్ కుమార్ రెడ్డి వెనకేసుకు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దేశ చరిత్రలో మంత్రులు, ఐఏఎస్‌లు జైలుకు వెళ్లిన దాఖలాలు లేవని కెసిఆర్ అన్నారు. తన మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన శనివారం పర్యటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం తాము పోరాటం చేయడం వల్లనే అది సాధ్యమైందని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తు కేసులో రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్రరావును అరెస్ట్ చేయాలని, అప్పుడే అన్ని బాగోతాలు బయటపడతాయని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కి అన్నారు. ఈ కేసులో కెవిపిపై సూరీడు వాంగ్మూలం ఇచ్చినా అరెస్ట్ చేయలేదని, దీని వల్ల సీబీఐపై మచ్చ పడే అవకాశం ఉందన్నారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా సిబిఐ వెంటనే కెవిపిని అరెస్ట్ చేయాలని మధుయాష్కి న్యూఢిల్లీలో డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన అదిలాబాదులో మీడియాతో మాట్లాడారు. దళిత ఎమ్మెల్యేలను దూషించిన ఘనత సీఎం కిరణ్‌కే దక్కుతుందని ఆయన ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణ సాధిస్తామని వివేక్ స్పష్టం చేశారు.

English summary
The Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) fired at CM Kiran Kumar Reddy. Meanwhile, Congress Telangana MP Madhu Yashki demanded arrest of KVP Ramachandar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X