జగన్ బందిపోటు, జైలు వద్ద పడిగాపులు: నారాయణ

Narayana
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ బందిపోటుగా అభివర్ణించారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో జగన్ ఆర్థిక నేరస్తుడని, అతని ప్రాపకం కోసం జైలు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పడిగాపులు కాస్తున్నారని ఆయన అన్నారు. ఇటువంటి వ్యవస్థను ఎవరు ప్రోత్సహించినా నేరమేనని, వారు కూడా క్రిమినల్సేనని ఆయన చెప్పారు.

తెనాలి ఘటనలో మరణించిన సునీల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతూ ఆయన శుక్రవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెనాలిలో ఒక యువతిని వేధించి, ఆమె తల్లిని చంపడం ఘోరమని ఆయన అన్నారు.

ఈ సంఘటనను ప్రజలు చూశారు. దీనికి విచారణలు, కోర్టులు, సాక్ష్యాలు అవసరం లేదని, విచారణలు పూర్తయ్యేలోగా జడ్జిలు, పోలీసులు మాయమవుతారని, చివరికి నేరం చేసినవాడు కూడా బ్రతికి బయటకి వస్తాడని, అందుకే అత్యాచారం వంటి నేరాలు చేసిన వారిని అక్కడికక్కడే కాల్చివేస్తే భయం ఉంటుందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలిగా సిబిఐ చార్జిషీట్‌లో పేర్కొన్నందున హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+