దొంగలు పడ్డ ఆర్నెల్లకు: ఆనం జగన్ వ్యాఖ్యలపై టిడిపి

కళంకిత మంత్రులపై తక్షణమే వేటు వేసి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సుపరిపాలనకు అద్దం పట్టిన రాష్ట్రాన్ని కాంగ్రెసు ప్రభుత్వం తల దించుకునే స్థాయికి దిగజార్చిందని వారు విమర్శించారు. తమ పార్టీని విమర్శించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాధనంతో హెలికాప్టర్‌లో తిరుగుతూ వీధి నాయకుడిలా వ్యవహరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
కళ్ల ముందు వేల కోట్ల రూపాయలను దోచుకున్నవారు కనిపిస్తున్నా వారిని కాపాడుతూ ముఖ్యమంత్రి పలికే చిలుక పలుకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని అంగీకరిస్తున్న ఆనం మంత్రిగా అప్పుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
వైయస్ ఏ పాపం చేశారో తెలియదన్న ఆనం ఇప్పుడు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, అప్పుడు ఆనం ఏం చేశారని వారన్నారు. జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మార్చారని అంటున్న ఆనం రామనారాయణ రెడ్డి మంత్రియేనా అని, మంత్రిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని వారన్నారు. ఆనం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించాలని వారన్నారు.












Click it and Unblock the Notifications