జగన్‌కు దాసోహం: యనమల, ఆనంపై బాలినేని ఫైర్

వారు బలిపశువులయ్యారు
వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసినవారు బలి పశువులయ్యారని మంత్రి పార్థసారథి అన్నారు. మంత్రులు కళ్లు మూసుకుని సంతకాలు చేయలేదని ఆయన శనివారం తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సంతకాల వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శక్తి పనిచేసిందని ఆయన ఆరోపించారు.
రామనారాయణరెడ్డిపై అసహ్యం వేస్తోంది..
వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. రామనారాయణ రెడ్డిని గౌరవించాలంటే కూడా అసహ్యం వేస్తోందని ఆయన శనివారం ఒంగోలులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే ఆనం జగన్‌పై వ్యాఖ్యలు చేశారనే అనుమానం వేస్తోందని ఆయన అన్నారు. లేదంటే ముఖ్యమంత్రి సీటు తనకు ఇస్తారనే ఆశతో వైయస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి చలువతో రాజకీయ భవిష్యత్తు పొందిన ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు సిగ్గుమాలిన మాటలు అంటున్నారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఆనం సోదరులు వెక్కి వెక్కి ఏడ్చారని, అదంతా దొంగ ఏడుపు అనుకావాలా అని అన్నారు. ఆనం సోదరులు నోళ్లను అదుపులో పెట్టుకోకపోతే జనం చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు.
ఆనం చరిత్ర అందరికీ తెలుసు..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఆనం వాడిన భాషపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఆనం చరిత్ర అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఆనం తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications