జగన్‌పై వ్యాఖ్యలు: ఆనంపై జగన్ పార్టీ నేతల ఫైర్

YSR Congress
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆనం అధికార మదంతో మాట్లాడుతున్నారని గట్టు రామచందర్ రావు శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆనం మదాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారథి సమర్థిస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్ జగన్ కేసులో ఉన్న ఆరుగురు మంత్రులను ప్రభావితం చేయడానికే ఆనం ఈ నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించిన మంత్రి ఆనంనే ముందు ఉరి తీయాలని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను భౌతికంగా లేకుండా చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల తమ కుటుంబం ఎంతో ప్రయోజనం పొందిందని ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డి అన్నారు. తమ అన్నలు ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ ఎదుగుదలకు వైయస్ రాజశేఖర రెడ్డి సహాయం చేశారని ఆయన నెల్లూరులో శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ నుంచి లబ్ధిపొందినవారిలో మొదటి వారు తన అన్నలేనని ఆయన అన్నారు. ఆనం వివేకానంద రెడ్డి రాజకీయంగా ముందుకు రావడానికి వైయస్ చలువే కారణమని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల ఎంతో మంది కొత్తగా మంత్రులయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. వైయస్ వల్ల ప్రయోజనం పొంది ఇప్పుడు విమర్సిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన శనివారం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+