తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్ని ప్రమాదం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి వడ ప్రసాదం తయారు చేసే పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక శకటాలు, సిబ్బందితో పాటు, అక్టోపస్ దళాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు.

మంటల కారణంగా ఆలయం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయ అంతర్భాగంలో ప్రమాదం సంభవించడంతో అధికారులు శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేసారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు.
షాట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నెయ్యి నిల్వ ఉండే ఉగ్రాణంలోకి మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెబతున్నారు. ఈ ఘటనలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకు అగ్నికి ఆహుతైంది. నష్టం భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications