క్రైమ్ నోట్స్: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యయత్నం

స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్ నగరంలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడిని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైని డ్రైవర్‌ను స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
తల్లిని చంపిన తనయుడు
వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులపై ఓ కసాయి కొడుకు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
వ్యాపారి దారుణ హత్య
మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్‌లో కిరణా వ్యాపారి రాజు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి వ్యాపారిపై దాడి చేసి కత్తితో గొంతు కోశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో కలుషిత ఆహారం తిని ఒకరు మృతి చెందారు. మరో 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications