అనుమానం: ప్రేయసిపై ప్రియుడి పెట్రోల్ దాడి

అయితే ఈలోపు దివ్య మరో స్నేహితునికి ఇంటర్నెట్‌లో ఫొటోలు పంపినట్టు తెలిసి మోహన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శుక్రవారం పొద్దునే ఏర్పేడు మండలం సదాశివపురంలోని బాధితురాలి ఇంటికి వెళ్లాడు. పొయ్యివద్ద వంటచేస్తున్న ఆమెపై పెట్రోల్ పోశాడు. వేరే యువకుడిని ప్రేమించడం వల్లనే పెళ్లిని వాయిదా వేసిందని అతను అనుమానం పెంచుకున్నాడు.
దాడికి గురైన యువతి దివ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం కంభావారిపల్లెకు చెందిన మోహన్ చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సదాశివపురం గ్రామానికి చెందిన దివ్య గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పుత్తూరులో ఇద్దరూ పీజి చేస్తుండగా ఇరువురికి మధ్య జరిగిన పరిచయం ప్రేమగా మారింది. దివ్యకు ఇది వరకే పెళ్లైంది. అయితే భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
పెట్రోల్ పోసిన వెంటనే పొయ్యిలోని మంటలు ఆమెకు అంటుకున్నాయి. మోహన్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications