భార్యతో భవనంపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

Suicide
చెన్నై: భవనంపై నుంచి దూకి 36 ఏళ్ల టెక్కీతో పాటు అతని భార్య అత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నై శివారులోని పల్లవరం ప్రాంతంలో శుక్రవారం జరిగింది. అరివలగన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నాడు. అతను తన 26 ఏళ్ల భార్య అభిరామితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అసహజమైన మరణం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పెద్ద శబ్దం రావడంతో అటువైపు భవనం వాచ్‌మన్ పరిగెత్తి చూశాడని, వారిద్దరు కింద పడి ఉండడాన్ని చూశాడని పోలీసులు చెప్పారు. భవనం నాలుగో అంతస్థులోని బాల్కనీ నుంచి కింది దూకి ఉంటారని, ఆ వెంటనే మరొకరు దూకి ఉంటారని పోలీసులు భావిస్తున్నారీు. అభిరామి అక్కడికక్కడే మరణించగా, అరివలగన్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

దంపతులిద్దరు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్స్. భార్య ఐటి రంగంలో పనిచేయాలని ఆరాపడుతుందనేది, దాంతో భర్త తీవ్ర నిస్పృహకు గురయ్యాడని, ఆమెను వ్యతిరేకిస్తూ వచ్చాడని, దాంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.

క్రోంపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అరివలగన్ సేలం జిల్లాకు, అభిరామి ఏరోడ్ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. టెక్కీ దంపతుల మృతిపై మాట్లాడడానికి బంధువులు, మిత్రులు నిరాకరించారు. పోలీసులకు సూసైడ్ నోట్ ఏదీ దొరకలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+