త్వరగా వెళ్లిపోండి: మందాపై డికె అరుణ, ఎంపి డుమ్మా

పార్టీని విడిచి పెట్టి వెళ్లాలనుకునే వారు త్వరగా వెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసే విషయంలో తాము వెనుకబడ్డామన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే తాను ఈ బస్సు యాత్ర చేపట్టానని తెలిపారు. ప్రచారంలో వెనుకబడినందునే తాను యాత్ర చేస్తున్నానన్నారు. జిల్లాలో తాను ఏడు రోజుల పాటు ఈ యాత్ర చేస్తానన్నారు.
డికె అరుణ బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నేతలు ప్రతాప్ రెడ్డి, అబ్రహం, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఎంపి మందా జగన్నాథం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.
సిఎంగా ఎవరున్నా... షబ్బీర్ అలీ
ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో ప్రకారమే అభివృద్ధి జరుగుతుంటుందని షబ్బీర్ అలీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు కాంగ్రెసు ప్రభుత్వం ఘనత అన్నారు. అల్ప సంఖ్యాక వర్గాలకు(మైనార్టీ) ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఒక ఏడాదిలో అభివృద్ధి నిధులు ఖర్చు కాకుంటే వాటిని మరో ఏడాదికి బదలాయిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications