లంచం ఇవ్వలేక సేలం బస్టాండ్‌లో ఆంధ్ర మహిళ కాన్పు

కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన శామ్యూల్, లక్ష్మిలు బతుకుదెరువు నిమిత్తం సేలంలో కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకటేష్ (5), నవీన్ (2) సంతానం. లక్ష్మి మూడోమారు గర్భం దాల్చింది. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వెళ్లింది.
ఆమె భర్త శామ్యూల్‌ను అక్కడి నర్సులు డబ్బులు డిమాండ్ చేశారు. తమ బీద పరిస్థితిని వివరించి కనికరించమని శామ్యూల్ వేడుకొన్నా ఫలితం లేకపోయింది. డబ్బులు లేకుంటే వైద్యం చేయమని నర్సులు నిష్కర్షగా చెప్పి, లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు నిరాకరించారు.
ఈ పరిస్థితుల్లో పురిటి నొప్పులు అధికమవ్వడంతో స్థానికులు బస్టాండు సమీపంలోని చెట్టు కిందనే ప్రసవం చేశారు. ఎలాంటి వైద్యసాయం లేకుండానే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దిక్కుతోచని స్థితిలో తమకు సాయపడిన స్థానికులకు శామ్యూల్కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఓ అంబులెన్సులో ఆమెను అదే ఆసుపత్రికి తరలించారు. విచారణ జరిపిస్తామని ఆసుపత్రి డీన్ చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications