వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్ ధిక్కరించా: జగన్ ఎమ్మెల్యే, అందలేదన్న చిన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bala Nagi Reddy
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం సమయంలో తాను పార్టీ విప్‌ను ధిక్కరించానని తెలుగుదేశం పార్టీ అసంతృప్త, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సోమవారం అన్నారు. స్పీకర్ నోటీసులకు ఆయన లేఖ రూపంలో సమాధానమిచ్చారు. నిన్న స్పీకర్ మనోహర్ కార్యాలయానికి రాకపోవడంతో శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు సీల్డ్ కవర్‌లో ఆయన తన సమాధానాన్ని అందించారు.

అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తనను కలిసిన విలేకరులతో ఆయన అన్నారు. అందుకు స్వయంగా స్పీకరే ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు. తీర్మానానికి సానుకూలంగా ఓటు వేసినందున స్పీకర్ దీనిపై తగు నిర్ణయం తీసుకో వచ్చునన్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర ఇచ్చిన విప్‌ను ధిక్కరించానని బాలనాగిరెడ్డి అంగీకరించారు.

మరోవైపు తాను కూడా నోటీసుకు సమాధానం ఇవ్వనున్నట్టు మరో టిడిపి ఎమ్మెల్యే చిన్నం రామ కోటయ్య వెల్లడించారు. నోటీసుకు లాయర్ల ద్వారా సమాధానం పంపుతున్నానని మీడియాకు ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానం నాడు శాసనసభకు రానప్పుడు, విప్ ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. విప్ సైతం తనకు అందలేదన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో కాంగ్రెసు పార్టీకి చెందిన తొమ్మిది మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది శాసనసభ్యులు తమ తమ పార్టీల విప్‌లను ధిక్కరించారు. పార్టీ విప్‌లు స్పీకర్‍‌కు ఫిర్యాదు చేయగా ఆయన నోటీసులు పంపారు.

English summary

 TDP rebel MLA Bala Nagi Reddy said that he was supported No Confidence Motion, which is produced by TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X