సిఎం సభకెళ్లొస్తూ 5గురు మృతి: కాన్వాయ్‌లో కార్లు ఢీ

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి ధర్మాన ప్రసాద రావు, కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు టెక్కలికి చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కిరణ్ అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సిఎం సభ నుండి తిరిగి వస్తూ అనంతలోకాలకు
టెక్కలి సభకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి చెందారు. సిఎం సభ నుండి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టెక్కలి మండలం అయోధ్యపురంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు నందిగామకు చెందిన వారిగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో మృతుల బంధువులు కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అచ్చెన్నాయుడి గృహ నిర్బంధం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో గృహ నిర్బంధం చేశారు. కిరణ్ పర్యటనను అడ్డుకోవడానకిి టిడిపి నేతలు సిద్ధం కావడంతో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సముద్రంలో చిక్కుకున్న మంత్రి బోటు
మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్, కలెక్టర్ నీతూకుమార్‌లు ఓ పడవలో సముద్రంలోని హోప్ ఐలాండ్‌ను సందర్శించి వస్తుండగా మధ్యలో పెట్రోలు ఆయిపోవడంతో సముద్రంలోనే ఆగిపోయింది. మరో బోటులో కాకినాడ తీరం నుండి పెట్రోలు తీసుకొని వెళ్లడంతో వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications