'జయప్రద పట్ల పోలీసుల దురుసు: భద్రతపై ఆందోళన'

ఈ ఘటన పైన నిష్పాక్షికంగా దర్యాఫ్తు జరపాలని ఆయన షిండేను కోరారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అమర్ సింగ్ ఇదే అంశంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా మరో విజ్ఞప్తి లేఖను సమర్పించారు.
ఈ నెల 13వ తేదిన జయప్రద తన నియోజకవర్గం రాంపూర్‌లో ఉన్నప్పుడు దాదాపు నలభై మంది మంది పోలీసులతో ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ అధికారులు వచ్చి ఆమె వాహనానికి గల ఎర్ర లైట్‌ను తీసి వేశారని, ఆ సమయంలో వారు జయప్రద పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.
గతంలో బహుజన సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ఎర్ర లైటును వినియోగించుకునేందుకు అనుమతించిందని, జయప్రద పట్ల దురుసు ప్రవర్తన వెనుక మంత్రి అజమ్ ఖాన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. కాగా, నాలుగు రోజుల క్రితం జయప్రద వాహనానికి ఉన్న ఎర్ర లైటును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications