లాయర్‌పై దాడి: దానంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Danam Nagender
హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఓ న్యాయవాదిపై దాడి చేసిన ఘటనలో దానం పైన ఐపిసి 147, 148, 149, 160, 323, 427, 307. 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

గత జనవరి 17న మంత్రుల నివాస సముదాయం నుండి తన నివాసానికి బయలుదేరుతున్న దానంను తెలంగాణ అడ్వోకేట్లు అడ్డుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన అడ్డుపడుతున్నారని మండిపడి వారు.. దానం కాన్వాయ్ పైన రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహించిన దానం వారిపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై న్యాయవాది కోర్టుకు వెళ్లడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలి: విజయవాడలో రాఘవులు

కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు బుధవారం విజయవాడలో డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదన్నారు. ఇది అవినీతి చెదలు పట్టిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. అమ్మ హస్తంలో కుంభకోణం ఉన్నట్లుగా కనిపిస్తోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అమ్మ హస్తంలో కుంభకోణం లేదని నిరూపించుకోవాలని రాఘవులు సూచించారు. పారదర్శఖత నిరూపించుకోవాలన్నారు.

ఇది అమ్మ హస్తం కాదని మాయా హస్తమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఇందిరమ్మ కల కాబట్టి తాము ప్రవేశ పెట్టామని కిరణ్ చెబుతున్నారని కానీ, దీనికోసం వామపక్షాలు ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయన్నారు. వామపక్షాల పోరాటం ఫలితం వల్లనే ఉప ప్రణాళిక వచ్చిందన్నారు. ఓట్లు దండుకునేందుకు కాంగ్రెసు ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మాయ చేస్తోందన్నారు. ప్రజలు తిరస్కరిస్తారనే భయం పట్టుకుంది కాబట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+