హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరి కష్టాలు వారివే..!: సర్వేలపై పార్టీల 'సొంత' సిగపట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu-K Chandrasekhar Rao
హైదరాబాద్: ఎన్నికల గడువుకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో రాష్ట్రంలోని ఆయా పార్టీలు సర్వేల జపం చేస్తున్నాయి! అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ... ఇలా ఎవరికి వారే సర్వేలపై కోటీ ఆశలు పెట్టుకున్నారు! గతంలో తమ తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆయా పార్టీలు ప్రయివేటు సర్వే సంస్థలను ఆశ్రయించేవి. కానీ, ఇప్పుడు సొంతగానే సర్వే చేసుకుంటున్నారట.

పార్టీకి సంబంధించిన వారే సర్వేలు చేస్తున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు సొంత సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సొంత సర్వేలు చేసుకుంటున్నాయట. సొంత సర్వేల వల్ల పూర్తి వాస్తవాలు తెలియడంతో పాటు ఖర్చు కూడా తగ్గిపోతుందట. ప్రయివేటు సర్వే సంస్థలను ఆశ్రయిస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.40వేల ఖర్చు వస్తుండగా సొంత సర్వేతో అందులో సగం మాత్రమే ఖర్చవుతుందట.

నలబై వేల రూపాయలు ఖర్చు చేసినా ప్రయివేటు ఏజెన్సీలు కేవలం వెయ్యి మంది అభిప్రాయాలు తీసుకుంటుండగా.. సొంత సర్వేలు కేవలం ఇరవై వేల రూపాయల ఖర్చుతోనే నాలుగువేల మంది అభిప్రాయాలు తీసుకుంటున్నారట. ఏదైనా జాతీయ సర్వే సంస్థతో సర్వే చేయించాలంటే ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల ఖర్చు వస్తుందట. టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రాష్ట్రంలో సొంత సర్వేలు చేసుకుంటున్నాయట.

తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం విశ్వవిద్యాలయ అధ్యాపకులచే సర్వేలు చేయించుకుంటుంది. సమాచారం మేరకు కాంగ్రెసు 150 నియోజకవర్గాల్లో, టిడిపి జిల్లాల స్థాయిలోలు చేయిస్తుండగా, వైయస్సార్ కాంగ్రెసు ప్రతి నెల సర్వేలు చేయిస్తోందట. సర్వే కోసం జగన్ పార్టీ దాదాపు డెబ్బై నియోజకవర్గాలను ప్రధానంగా ఎంచుకుందట.

English summary
The next general elections are just one year away and all the political parties are busy surveying the pulse of the voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X