హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెన్‌డ్రైవ్‌లో కీలక సమాచారం: జగన్‌కు లంచాల్లో కోడ్స్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పలు కంపెనీల నుండి తన కంపెనీలలోకి పెట్టుబడులు రప్పించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ కేసును దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పలు సిబిఐ పలు ఛార్జీషీట్లను కూడా దాఖలు చేసింది. దాల్మియా నుండి వైయస్ జగన్‌కు ముడుపులు ముట్టాయనే అభియోగాలు కూడా ఉన్నాయి.

దాల్మియా నుండి ముడుపులను తీసుకునే క్రమంగా జగన్ పేరును 'జె', 'జాగ్స్', 'జెఆర్' అనే కోడ్‌లను ఎస్సెమ్మెస్, మెయిల్స్‌లలో ఉపయోగించే వారట. ఈ విషయాన్ని సిబిఐ తన తాజా ఛార్జీషీటులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడు నుండి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ ద్వారా సిబిఐ పలు అంశాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ముడుపులు హవాలా ద్వారా వచ్చినట్లుగా సిబిఐ గుర్తించింది.

జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడి దూకుడు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి రెండో అటాచ్‌మెంట్ పైన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) న్యాయప్రాధికారిక సంస్థ ముందు విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈడి రెండో దఫా 143.74 కోట్ల రూపాయలను జఫ్తు చేసింది.

135.46 ఏకరాల భూమిని, 3.20 కోట్ల రాంకీ డిపాజిట్లను, జగతికి చెందిన రూ.10 కోట్ల డిపాజిట్లను ఈడి జఫ్తు చేసింది. దీనిపై న్యాయప్రాధికారిక సంస్థలో విచారణ కొనసాగుతోంది. ఈడి న్యాయప్రాధికారిక సంస్థ ముందు జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి హాజరయ్యారు.

English summary
In the quid pro quo case, the alleged bribe given by Dalmia Cements to Kadapa MP Y.S. Jagan Mohan Reddy, he was referred as “J” “Jags” and “JR”, in their coded communications via SMS and emails.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X