కాక్రోచ్ జనతా పార్టీ.. మహోద్యమానికి తొలి ముందడుగు

కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. మొట్టమొదటి మహా ధర్నాకు శ్రీకారం చుట్టింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు వేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ తలపెట్టిన నిరసన కార్యక్రమం కోసం పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే ఢిల్లీకి సైతం చేరుకున్నారు. దీనికి అనుమతి కూడా లభించింది ఢిల్లీ పోలీసుల నుంచి. పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలపై నిరసన తెలపడానికి, అమెరికా నుంచి వచ్చారు డిప్కే.

ఈ ఉద్యమానికి విద్య, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ ఛుక్ కూడా మద్దతు ప్రకటించారు. మంత్రి ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయని పక్షంలో తాను కూడా నేరుగా ఈ నిరసనలో భాగస్వామ్యం పంచుకుంటానని వాంగ్ ఛుక్ ఇదివరకే స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ధర్నాకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్ డేట్స్ మీకోసం..

Cockroach Janta Party Protest LIVE Updates  Protesters Demand Education Minister s Resignation Over Exam Lapses

Jun 06, 2026, 4:59 pm IST

జంతర్‌మంతర్‌లో ముగిసిన కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన. బొద్దింక మాస్కులు, అంబేద్కర్‌ చిత్రపటాలతో ధర్నా. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌. నిరసనలో హైలైట్‌గా నిలిచిన 8 లక్షల సంతకాలతో కూడిన పిటిషన్‌.
Jun 06, 2026, 3:18 pm IST

కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో పాల్గొన్న సోనమ్ వాంగ్ ఛుక్ వాంగ్ ఛుక్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్
Jun 06, 2026, 2:28 pm IST

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లోని అభిజీత్ దిప్కే నివాసం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను భారీగా కట్టుదిట్టం చేశారు.
Jun 06, 2026, 1:23 pm IST

రామ్‌లీలా మైదానంలో తదుపరి పోరాటం

జూన్ 23న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రెండో విడత భారీ నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.
Jun 06, 2026, 1:21 pm IST

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు నిరసనకారులను దిల్లీ పోలీసులు అడ్డుకుని బయటకు పంపించేశారు.
Jun 06, 2026, 12:01 pm IST

జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న అభిజిత్ డిప్కే భారీగా తరలివచ్చిన యువత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
Jun 06, 2026, 10:52 am IST

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల అనుమతి.. జాతీయ జెండాతో యువత

జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన. జాతీయ జెండాలతో భారీగా తరలివస్తున్న యువత. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై సీజేపీ నిరసన. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. CJP ధర్నాకు పోలీసుల అనుమతి. సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమం. కాక్రోచ్ మాస్కులతో నిరసనకు తరలివచ్చిన యూత్.
Jun 06, 2026, 10:47 am IST

కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా కి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నాకు అనుమతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+