కేసునుండి తప్పించండి: మోపిదేవి, మంత్రి పాత్ర: సిబిఐ

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి తనను తప్పించాలని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సిబిఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తనపై కేసును రుజువు చేయడానికి తగిన ఆధారాలు లేవని అతను డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జీషీటు దాఖలు చేసినప్పటికీ తనపై కేసు లేదని, కేసు లేకుండా అభియోగాల నమోదు చేపట్టరాదన్నారు.

తాను రోజువారీ విధుల నిర్వహణలో భాగంగానే వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పరిశీలించానని, ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అయితే మోపిదేవిపై నేరం రుజువు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయంటూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వాన్‌పిక్‌కు భారీగా భూములు కేటాయించిన వ్యవహారంలో అప్పటి మౌలిక వసతులు, ఓడరేవుల మంత్రి మోపిదేవి పాత్ర ఉందని సిబిఐ పేర్కొంది.

ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. మోపిదేవి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై అభ్యంతరం చెబుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. వాడరేవు, నిజాంపట్నం ఓడరేవులకు 2 వేల ఎకరాల చొప్పున, కారిడార్‌కు 24 వేల ఎకరాల భూకేటాయింపు జరుపుతూ ఇచ్చిన జీవోల వెనుక మంత్రి హస్తం కూడా ఉందని స్పష్టం చేసింది. జగతిలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854 కోట్ల పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్సుకు భూములు కేటాయించారని ఇదంతా క్విడ్ ప్రోకో విధానంలో జరిగిందని తెలిపింది.

వాన్‌పిక్ ప్రాజెక్టు మెమొరాండంను మంత్రి మోపిదేవి ఆమోదించారని, దానిని 2008 జూన్ 30న కేబినెట్ ముందు పెట్టారని సీబీఐ తెలిపింది. అయితే, ఈ మెమొరాండానికీ వాన్‌పిక్‌కు పలు రాయితీలు కల్పిస్తూ తయారు చేసిన ముసాయిదా పత్రానికి తేడా ఉందని, ఆ రెండింటిలో సమాచారం వేర్వేరుగా ఉందని పేర్కొంది. మోపిదేవి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చే పరిస్థితి తలెత్తిందని నివేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+