వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దద్దమ్మలే వెళ్తారు: కెసిఆర్‌పై ఎర్రబెల్లి, మోత్కుపల్లి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao and Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ రెచ్చగొట్టే మాటలతో వెయ్యి మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. కెసిఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు.

ఉద్యమం పేరుతో కెసిఆర్ ఫాం హౌస్‌లో పడుకున్నారని, ఫాంహౌస్‌లో పడుకొని ఉద్యమిస్తే జెఏసి నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అఖిల పక్షం కోసం డిమాండ్ చేసింది టిడిపియేనని, తెలంగాణపై తమ పార్టీ స్పష్టత ఇచ్చిందని అయినా కెసిఆర్ టిడిపిని లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. సకల జనుల సమ్మెతో పాటు పలు సందర్భాలలో తెలంగాణ వస్తుందనుకున్న సమయంలో ఉద్యమాన్ని ఢిల్లీలో కెసిఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు.

పోలవరం టెండర్ల కోసమే ఉద్యమాన్ని తాకట్టు పెట్టారన్నారు. కెసిఆర్‌కు తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ తొత్తుగా మారారన్నారు. కాంగ్రెసు పార్టీతో తెరాస కుమ్మక్కవుతోందని, దీనిని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, జెఏసి నేతలు కూడా గుర్తించాలన్నారు. లేదంటే వారు పదవుల కోసం ఆరాటపడుతున్నారని భావించే ప్రమాదముందన్నారు. ఉద్యమాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం నీరుగార్చింది కెసిఆరే అన్నారు.

కెసిఆర్‌కు విశ్వసనీయత లేదని, తెలంగాణవాదాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు. తెరాసలోకి వెళ్లే వారు తెలంగాణవాదులు కాదని తెలివి తక్కువ దద్దమ్మలన్నారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ మోసం చేస్తున్నారన్నారు. వేరే పార్టీ నాయకులను ప్రలోభ పెట్టి తీసుకోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఉండగా నేతలకు ఎందుకు గాలమేస్తున్నారన్నారు. కెసిఆర్ ప్రజలను వదిలి ఇప్పుడు నేతల చుట్టు తిరుగుతున్నారని విమర్శించారు.

English summary
Telugudesam Party senior leaders Mothkupalli Narasimhulu and Errabelli Dayakar Rao lashed out at TRS chief K Chandrasekhar Rao on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X