హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు పర్యవేక్షణకు జగన్ కేసుపై పిల్ దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. శ్రీరంగారావు అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణ హైకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆయన కోరారు. జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు దాఖలైన చార్జిషీట్లను హైకోర్టు పర్యవేక్షించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

జగన్ ఆస్తుల కేసులో అసలు నిందితులను తప్పిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొంత మందిని విచారించి వదిలేశారని ఆయన అన్నారు. మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసిన సిబిఐ మిగతా ఇద్దరు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను నిందితులుగా చేర్చిందని ఆయన అన్నారు. 2జి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణ మాదిరిగా వైయస్ జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు.

జగన్ ఆస్తుల కేసును సిబిఐ హైకోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు చేస్తోందని, అందువల్ల విచారణను హైకోర్టు పర్యవేక్షించాలని ఆయన అన్నారు. మాజీ మంత్రి పి. శంకరరావు చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు సిబిఐ జెడి లక్ష్మినారాయణను ఇక్కడే కొనసాగించాలని ఆయన కోరారు. పదవీ కాలం ముగుస్తుండడంతో త్వరలో లక్ష్మినారాయణ మాతృ సంస్థకు వెళ్లిపోతారనే వార్తలు వచ్చాయి.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగన్ సహా పలుపురిని సిబిఐ అరెస్టు చేసిందని, కొంత మందిని విచారించి వదిలేసిందని శ్రీరంగారావు అన్నారు. శ్రీరంగారావు దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

English summary
A lawyer Sriranga Rao filed PIL in YSR Congress party president YS Jagan DA case. He appealed to the High court to supervise YS Jagan DA case trail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X