వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు బిజెపి కార్యాలయం వద్ద పేలుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Blast outside BJP office in Bangalore
బెంగళూరు/హైదరాబాద్: కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయం ఎదుట ఈ పేలుడు సంభవించింది. ఓ కారులో ఉన్న సిలిండర్ కారణంగా పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది.

కర్నాటక ఎన్నికలకు మరో ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో బిజెపి ఆఫీసు వద్ద కారులో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ఘటనలో పదకొండుమందికి గాయాలయ్యాయి. అందులో ఎనిమిది మంది పోలీసులు. వారిని ఆసుపత్రికి తరలించారు. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనానికి బాంబు అమర్చి పేల్చి ఉంటారనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

హైదరాబాదులో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రసూల్‌పురాలో ఓ హోటల్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ముషీరాబాదులోని మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) ఆసుపత్రికి తరలించారు.

ఎపిలోని కరీంనగర్ జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. బోర్ వెల్ కార్మికుల మధ్య ఘర్షణ ముగ్గురి హత్యకు దారి తీసింది. స్థానికంగా ఇది కలకలం రేపింది. ఘర్షణ కారణంగా మంగళవారం సెల్వరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ రోజు ఓ రైతుతో పాటు మరొకరు హత్యకు గురయ్యారు. వీరి హత్యకు ఒరిస్సా కార్మికులే కారణమని అనుమానిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని పూడిమడకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వందలాది మత్సకారుల ఇళ్లు ఆహుతయ్యాయి. ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి.

బెంగళూర్ బిజెపి కార్యాలయం వద్ద పేలుడు వీడియో

English summary
Panic spread in Bangalore after a car parked near the BJP office in Malleswaram exploded into a plume of smoke and fire on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X