వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక మాజీ గవర్నర్ రమాదేవి కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

VS Ramadevi
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కర్ణాటక మాజీ గవర్నర్ వియస్ రమాదేవి కన్నుమూశారు. కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో మడివాళ నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ తరలించనున్నారు. వియస్ రమాదేవి 1934 జనవరి 15వ తేదీన జన్మించారు. ఆమె స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు. ఆమె తల్లిదండ్రులు వివి సుబ్బయ్య, వి. వెంకట రత్నమ్మ. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఎంఎ, ఎల్ఎల్ఎం చేసిన రమాదేవి 1990 నవంబర్ 26వ తేదీ నుంచి 1990 డిసెంబర్ 11వ తేదీ వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. టిఎన్ శేషన్ తర్వాత ఆమె చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమె 1997 జులై 26వ తేదీ నుంచి 1999 డిసెంబర్ 1వ తేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు.

1999 డిసెంబర్ 2వ తేదీ నుంచి 2002 ఆగస్టు 20వ తేదీ వరకు కర్ణాటక గవర్నర్‌గా ఉన్నారు. ఆమె లా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ఆమె పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్ గౌరవ సలహాదారుగా కూడా ఉన్నారు.

వియస్ రమాదేవి తెలుగులో నవలలు, కథలు, వ్యాసాలు, నాటకాలు రాశారు. మహిళలు - చట్టాలు, పిల్లలు - చట్టాలు వంటి ఎన్నో రచనలు చేశారు. రాజ్యసభ ఎట్ వర్క్ అనే రచనకు ఆమె సహ రచయితగా ఉన్నారు.

English summary
Karnataka former governor VS Ramadevi passed away. V. S. Ramadevi (born 15 January 1934) M.A, L.L.M, was the Chief Election Commissioner of India from 26 November 1990 to 11 December 1990. She is the only woman, who became Chief Election Commissioner of India. She was succeeded by T. N. Seshan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X