బెంగళూరులో పేలుళ్లు: హెబ్బాల వద్ద మరో బ్లాస్ట్?

 Serial blasts in Bangalore
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో మరో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. మల్లేశ్వరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పేలుడు జరిగిన కొద్ది గంటలలోనే హెబ్బల ప్రాంతంలో మరో పేలుడు బుధవారం మధ్యాహ్నం సంభవించింది. హెబ్బల ఫ్లై ఓవర్ ప్రాంతంలో సంభవించిన పేలుడులో 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరుసగా రెండు పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీ నుండి బెంగళూరుకు క్లూస్ టీం బయలుదేరింది. హెబ్బల పేలుడును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. అయితే, రెండో బ్లాస్టు రూమర్‌‌గా పోలీసులు చెబుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

కాగా, అంతకుముందు కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయం ఎదుట ఈ పేలుడు సంభవించింది. ఓ ద్విచక్ర వాహనంపై బాంబును ఉంచడంతో ఈ పేలుడు సంభవించింది.

కర్నాటక ఎన్నికలకు మరో ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో బిజెపి ఆఫీసు వద్ద కారులో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ఘటనలో పదకొండుమందికి గాయాలయ్యాయి. అందులో ఎనిమిది మంది పోలీసులు. వారిని ఆసుపత్రికి తరలించారు. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.

వరుస పేలుళ్ల నేపథ్యంలో ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పేలుళ్ల నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాదు వంటి మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

బెంగళూర్ బిజెపి కార్యాలయం వద్ద పేలుడు వీడియో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+