వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి దంపతులు: కర్ణాటక ఎన్నికల్లో రిచెస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

H D Kumaraswamy
బెంగళూర్: కర్ణాటక శానససబహ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడిఎస్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, ఆయన సతీమణి అనిత అస్తుల విలువ 123 కోట్ల రూపాయలు. వచ్చే నెల 5వ తేదీన జరిగే శానససభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు తమ ఆస్తులను ప్రకటించారు. దాంతో అత్యంత సంపన్నులైన దంపతుల జాబితాలో వారు నిలిచారు.

అత్యంత సంపన్నులైన అభ్యర్థుల జాబితాలో రూ.150.58 కోట్లతో టిఎన్ జావరాయి గౌడ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన జెడిఎస్ అభ్యర్థి. బెంగళూర్‌లో యశ్వంతపూర్ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కుమారస్వామి రామనగరం నుంచి, ఆయన భార్య అనిత అనిత చన్నపట్న నుంచి పోటీ చేస్తున్నారు.

పలువురు కోటీశ్వరులు కర్ణాటక శానససభ ఎన్నికల బరిలో నిలిచారు. బిజెపికి చెందిన పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ ఆస్తుల విలువ రూ. 104 కోట్లు. గనులకు నెలవైన బళ్లారి జిల్లాలోని విజయనగర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సింగ్ ఓ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గనుల యజమానిగా కూడా పేరు గడించారు.

దేవెనగరే సౌత్ నుంచి కాంగ్రెసు కోశాధికారి శమనూరు శివశంకరప్ప ఆస్తుల విలువ రూ. 67 కోట్లు. ఆయనకు దేవెనగరేలో విద్యాసంస్థలున్నాయి. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జి. పరమేశ్వర ఆస్తుల విలువ రూ. 3.87 కోట్లు. మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనత పక్ష వ్యవస్థాపకుడు బిఎస్ యడ్యూరప్ప తన ఆస్తుల విలువను రూ. 5.96 కోట్లుగా వెల్లడించారు. 2008 ఎన్నికల్లో వెల్లడించిన ఆస్తుల విలువ కన్నా ఇది 3 కోట్ల రూపాయలు ఎక్కువ.

English summary
DS Karnataka unit President and former chief minister H D Kumaraswamy and his wife Anita, contesting the May 5 Assembly elections, have together declared assets worth Rs. 123 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X