ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా: కృష్ణా ఫస్ట్

బాలికల ఉత్తీర్ణత శాతం 59.46, బాలుర ఉత్తీర్ణత శాతం 50.22గా ఉంది. ఏ గ్రేడ్ 43 శాతం, బి గ్రేడ్ 32 శాతం, సి గ్రేడ్ 16.9 శాతం, డి గ్రేడ్ 7.7 శాతం విద్యార్థులు పొందారు. వొకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 46.54గా ఉంది. మొత్తం 4,86,658 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలికలు 2,62,339 కాగా బాలురు 2,35,316.
జిల్లాలలో ఉత్తీర్ణత శాతం: శ్రీకాకుళం జిల్లా - 52 శాతం, తూర్పుగోదావరి - 54, పశ్చిమగోదావరి - 58
గుంటూరు - 63, ప్రకాశం - 53, నెల్లూరు- 64, చిత్తూరు- 58 కర్నూలు - 52, అనంతపురం- 45,
కడప- 50, ఆదిలాబాద్- 48, మెదక్- 41 రంగారెడ్డి- 64, నిజామాబాద్- 41, కరీంనగర్- 47
ఖమ్మం- 51, వరంగల్- 46, నల్గొండ- 41, హైదరాబాద్- 55, విజయనగరం - 49 శాతం
మే 22 నుండి సప్లిమెంటరీ.. పార్థసారథి
మే 22 నుండి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి పార్థసారథి చెప్పారు. మే 3లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత లేని వారితో పేపర్లు దిద్దించామన్నది అవాస్తవమని చెప్పారు. అర్హత ఉన్న వారితో కూడా రోజుకు 30 పేపర్లు మాత్రమే దిద్దించామన్నారు. ఈ నెల 25 లేదా 26న ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications