నమ్మకం లేదంటున్న టిఎంపీలు: నష్టంలేదని లగడపాటి

నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం మాట్లాడుతూ... రెండో దఫా పార్లమెంటు సమావేశాలలో తమను పార్లమెంటు నుండి బహిష్కరించినా తెలంగాణవాదాన్ని బలంగా వినిపిస్తామని చెప్పారు. కాంగ్రెసు తెలంగాణపై ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసుకు గడ్డుకాలమే అన్నారు.
ప్రభుత్వానికి ఢోకా లేదు: లగడపాటి
2014 వరకు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కాంగ్రెసు పార్టీని ఎవరు విడిచి వెళ్లినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. బయ్యారం గనులను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ ప్లాంటుకు ఇచ్చారన్నారు.
విశాఖ స్టీల్ జాతీయ సంపద అన్నారు. అలాంటి జాతీయ పరిశ్రమకు బయ్యారం గనులను కేటాయించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. రాష్టాన్ని నాశనం చేస్తున్న వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా అన్నారు.
రాజకీయమొద్దు: గంటా
బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు కేటాయించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు జాతి సంపద అని, దీనిని తెలంగాణవాదులు రాజకీయం చేయడ ఏమాత్రం సరికాదన్నారు. కాగా, అంతకుముందు గంటాకు చేదు అనుభవం ఎదురయింది. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన అతనిని బాధితులు, టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసుల భద్రత మధ్య ఆయన అక్కడి నుండి వచ్చారు.












Click it and Unblock the Notifications