వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అల్లుడికి దోచిన వైఎస్, ఫాంహౌస్‌ పార్టీకి సూట్‌కేసులు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విశాఖపట్నం: బయ్యారం గనుల అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్ రాజశేఖర రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లుడికి లక్షా 46 వేల ఎకరాల గనులను కట్నంగా ధారాదత్తం చేశారని, ఆయన నుంచి సూట్‌కేసులందుకున్న ఓ ఫామ్ హౌస్ పార్టీ అప్పట్లో మౌనం వహించిందని, ఇప్పుడేమో బయ్యారంపై యాగీ చేస్తోందని తెరాసపై బాబు శనివారం మండిపడ్డారు.

మంత్రివర్గంలోని కళంకితులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం గనులపై తొలి నుంచి రాజీ లేని పోరాటం చేసింది టిడిపియే అన్నారు. ఎక్కడ గనులుంటే అక్కడే స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని టిడిపి గతంలోనే ప్రతిపాదించిందన్నారు. ఖనిజ సంపద ప్రజలకు ఉపయోగపడాలి తప్ప, దోపిడీదారులకు కాదని స్పష్టం చేశారు. నిందితులుగా ఉన్న మంత్రులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు.

కళంకిత మంత్రులపై ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స చివరికి ఏం తేల్చారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా చాలామంది ఏ-4 లు ఉన్నారన్నారు. వైయస్ పాలనతో నష్టపోయింది కాంగ్రెస్ కాదని, ప్రజలే అన్నారు. అంతులేని అవినీతికి పాల్పడి జైలులో కూర్చున్న వారికి అనుకూలంగా మాట్లాడాలా అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగానే తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పించి అత్యాచారాలను నిరోధిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆడపిల్లలను చదివించాలని కోరారు. తన కోడలిని ఆరేళ్లుగా చదివిస్తున్నానని, ఆడపిల్లలను ఎంతగా చదివిస్తే అంతగా ఆ ఇంటి గౌరవం పెరుగుతుందన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has 
 
 balmed Telangana Rastra Samithi over Bayyaram mines 
 
 issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X