చిరంజీవి ప్రత్యక్ష మోసం, జగన్‌ను పంపించాలనే: షర్మిల

ఈనాడు రూ.100 విలువ చేసే షేర్‌ను రూ.5 లక్షలకు అమ్ముకుంటే తప్పు లేదు కానీ సాక్షి రూ.10 విలువ చేసే షేర్‌ను 350కి అమ్మితే తప్పంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారని, కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని, అందుకే ఆయనపై సిబిఐ, ఈడి కేసులు ఉండవని విమర్శించారు. ఆయన అండ చూసుకొనే ప్రభుత్వం జనం నెత్తిన రూ.32 వేల కోట్ల విద్యుత్ భారం వేసిందన్నారు.
జగన్‌ను రాష్ట్రం నుండి పంపించి వేయాలని అన్ని పార్టీలు చూస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీలో కొందరు జగన్‌ను ఉరివేయాలని, వైయస్ కుటుంబాన్ని వెలి వేయాలని అంటున్నారని, ఏ కోర్టు ఇంత వరకు జగన్‌ను దోషిగా నిర్ధారించలేదన్నారు. కృష్ణా జిల్లా వాసులకు వరంలా ఉపయోగపడాల్సిన పులిచింతల ప్రాజెక్టు జాప్యం ప్రస్తుత ప్రభుత్వ పాపమే అన్నారు.
వైయస్ జీవించి ఉంటే 2009లోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉండేదన్నారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబును వైయస్ హెచ్చరించినా మిన్నకుండటంతో సాగునీటి కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెసు పార్టీకి అమ్ముడుపోయిన చిరంజీవి తనను నమ్మి ఓట్లేసిన వారిని ప్రత్యక్షంగా మోసం చేశారన్నారు. బాబు ప్రభుత్వానికి అక్రమంగా కొమ్ము కొస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications