వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమేజ్ ప్రాబ్లమ్: చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయ పార్టీలకు ఇమేజ్ ప్రాబ్లమ్ వచ్చినట్లుంది. తమ ఆదర్శ నాయకుడిగా, తమకు ప్రజలను సమీకరించే నేతగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంపై రాష్ట్రంలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతోంది. ప్రజాకర్షణ గల నాయకులను తమ ఫ్లెక్సీల్లో రాజకీయ పార్టీలు వాడుకోవడం పరిపాటి. అందుకు సంబంధించి ఏ పార్టీకి చెందిన నాయకుడు లేదా ఐకాన్ ఒకరో ఇద్దరో ఉంటారు. తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు ఇంత కాలం ఉపయోగపడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన బొమ్మ కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.

స్వర్గీయ ఎన్టీ రామారావు బొమ్మను తెలుగుదేశం పార్టీయే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వాడుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడాన్ని చూసిన కాంగ్రెసు పార్టీ ఎన్టీఆర్ బొమ్మను తాము వాడుకుంటే తప్పేముందని అనుకుందో ఏమో, అక్కడక్కడా వాడుకుంది. మంత్రి శైలజానాథ్ కార్యక్రమంలో తాజాగా స్వర్గీయ ఎన్టీ రామారావు బొమ్మను కాంగ్రెసు వాడుకుంది. గతంలో విశాఖపట్నం జిల్లాలోనూ ఎన్టీఆర్ బొమ్మను వాడుకుంది.

ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ వ్యతిరేకించినా ఇతర పార్టీలు ఆయన బొమ్మను వాడుకోవడాన్ని మానడం లేదు. పైగా, ఎన్టీ రామారావు అందరికీ చెందినవాడని, ఎవరైనా వాడుకోవచ్చుననే వాదనను నందమూరి హరికృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి ముందుకు తెచ్చారు. ఎన్టీ రామారావు బొమ్మను వాడుకునే హక్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తప్ప అందరికీ ఉందని గుడివాడ శానససభ్యుడు కొడాలి నాని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ బొమ్మలతో పాటు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలను వాడి వివాదానికి తెర తీసింది. కాంగ్రెసు పార్టీ నిజానికి, చిరంజీవిని వాడుకోవాలి. మెగాస్టార్‌గా ప్రజాకర్షణ గల నటుడిగా చిరంజీవి బొమ్మను కాంగ్రెసు పార్టీ ఎక్కడా వాడడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి రాష్ట్ర స్థాయి నాయకులకు ఆగ్రహం వస్తుందనో, మరో కారణంగానో చిరంజీవి బొమ్మను కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వాడడం లేదు. మెగాస్టార్ చిరంజీవి బొమ్మను వాడుకుంటే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ వంటి హీరోల బొమ్మలను కూడా వాడుకోవడానికి వీలవుతుంది. కానీ కాంగ్రెసు కార్యకర్తలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.

కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు పెద్ద దిక్కుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బొమ్మలను ఫ్లెక్సీల్లో వాడుకోవాలి. కానీ, కాంగ్రెసును ధిక్కరించిన ఎన్టీ రామారావు బొమ్మలను వాడుకోవడం కాస్తా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ, ప్రజల్లో ఎన్టీ రామారావుకు ఉన్న ఇమేజ్‌ను కాస్తా వాడుకుందామనే ఉద్దేశంతోనో, తెలుగుదేశం పార్టీని గందరగోళంలో పడేసే ఉద్దేశంతోనో ఎన్టీ రామారావు బొమ్మలను వాడుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

కృష్ణా జిల్లాలో షర్మిల పాదయాత్ర సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను తమ ఫ్లెక్సీల్లో వాడుకోవడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వివాదానికి తెర తీసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మనే కాకుండా సీనియర్ ఎన్టీ రామారావు బొమ్మను కూడా వాడుకోవడం ప్రారంభించారు.

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

కాంగ్రెసు పార్టీ గతంలో సోనియా గాంధీ, వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మలను వాడుకునేది. ఇప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మను వాడుకోలేని స్థితి కల్పించింది. వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కూడా వైయస్ జగన్ లాగేసుకున్నట్లే. కాబట్టి వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకుంటోంది.

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు వైయస్సార్ కాంగ్రెసు సొంతం కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్తా జాగ్రత్తపడినట్లు కనిపిస్తున్నారు. వారిద్దరి బొమ్మలతో బాలకృష్ణ బొమ్మను కలిపి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయినా సరే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు.

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

మెగాస్టార్ చిరంజీవికి ప్రజాకర్షణ దండిగానే ఉంది. అయితే, కాంగ్రెసు కార్యకర్తలు గానీ నాయకులు గానీ ఆయన బొమ్మను వాడుకోవడానికి ముందుకు రావడం లేదు. చిరంజీవి బొమ్మను వాడుకుంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ వంటి వారి బొమ్మలను కూడా వాడుకోవడానికి వీలు కలుగుతుందనే ఆలోచన కాంగ్రెసువాళ్లకు తట్టినట్లు లేదు.

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

సినీ రంగంలో దూకుడు మీదున్న మహేష్ బాబు బొమ్మను వాడుకోవడానికి కూడా రాజకీయ పార్టీలు వెనకాడడం లేదు.

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

చిరు పనికిరాడా, ఎన్టీఆర్‌కు డిమాండ్

కాంగ్రెసు పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్లాలి. కానీ, ఆ పార్టీ ఇతరేతర మార్గాలు వెతకడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

English summary
The Congress, YSR Congress are using NT Ramarao images in their flexees along with YS Rajasekhar Reddy and YS Jagan. Even the Congress also using NT Ramarao images. Congress is ignoring megastar Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X