జగన్ కేసు: సిబిఐకి సుప్రీం నోటీస్‌లు, ప్రశ్నించిన భారతి

దీనిపై ఈ రోజు విచారణ ప్రారంభమైంది. జగన్ తరఫున హరీష్ సాల్వే వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా గతంలో జగన్ బెయిల్ తిరస్కరించినప్పుడు కోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? అని ప్రశ్నించింది. అనంతరం జగన్ బెయిల్ కేసులో సిబిఐకి సుప్రీం కోర్టు నోటీసులను జారీ చేసింది. వచ్చే నెల మే 6 తేదీలోగా జగన్ బెయిల్ పిటిషన్ దరఖాస్తు పైన జవాబు చెప్పాలని సిబిఐని ఆదేశించింది.
కాగా, జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభం నేపథ్యంలో జగన్ సతీమణి భారతి రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డిలు వాదనలు వినిందుకు కోర్టుకు వచ్చారు. జగన్ దరఖాస్తు సదాశివం నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. జగన్‌కు సిబిఐ తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిబిఐకి నోటీసులు జారీ చేసి కేసును 6వ తేదికి వాయిదా వేసింది. 6లోగా సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
సిబిఐని నిలదీసిన భారతి
విచారణ కోసం కోర్టుకు వచ్చిన జగన్ సతీమణి భారతి రెడ్డి సిబిఐ అధికారులను కేసుపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
కోర్టుకు హాజరైన ధర్మాన
జగన్ ఆస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ రోజు హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, విజయ రాఘవ, కోనేరు ప్రసాద్, ఓఎంసి కేసులో రాజగోపాల్ తదితరులు హాజరయ్యారు. జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసుల నిందితులకు కోర్టు రిమాండును మే 13 వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications