జగన్ బెయిల్ లింక్‌పై లాయర్: ధర్మాన, జానాలకి ఊరట

YS Jagan - Darmana Prasada Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ కారణాలతోనే బెయిల్ రావడం లేదనే వాదనలు ఉన్నాయని జగన్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. సోమవారం జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభం కావడం ఆ తర్వాత సిబిఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ సందర్బంగా జగన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి పలు అంశాలను తీసుకు వచ్చారు.

జగన్‌కు బెయిల్ దొరకకుండా చేయడానికే సిబిఐ ఛార్జీషీట్ల పేరుతో కాలాయాపన చేస్తోందన్నారు. జగన్‌కు బెయిల్ కావాలంటే కాంగ్రెసు పార్టీలో చేరాలని స్వయంగా కేంద్రమంత్రే అన్నారని చెప్పారు. అందుకు సంబంధించిన పత్రిక ప్రకటనను ఆయన కోర్టుకు చూపించారు. కాంగ్రెసులో చేరితే బెయిల్ వస్తుందని మంత్రే స్వయంగా చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమన్నారు.

జగన్‌కు బెయిల్ ఇస్తే దర్యాఫ్తునకు సహకరించరని సిబిఐ భయపడుతోందా? అని హరీష్ సాల్వే ప్రశ్నించారు. సిబిఐ ఛార్జీషీట్ల విషయంలో మాట తప్పిందన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సదాశివం.. కేసు దర్యాఫ్తు ఎక్కడి వరకు వచ్చిందని జగన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. కాగా, కోర్టుకు సిబిఐ తరఫు న్యాయవాదులు హాజరు కాలేదు. సిబిఐకి నోటీసులు జారీ చేసిన కోర్టు కేసును మే 6వ తేదికి వాయిదా వేసింది.

జగన్ కేసు హైకోర్టు పరిధిలో....

మరోవైపు జగన్ కేసును హైకోర్టు పరిధిలో విచారించాలన్న పిటిషన్ పైన వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. జగన్ ఆస్తుల కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో జెడి లక్ష్మీ నారాయణను బదలీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయనని, ఆయనను బదలీ చేయవద్దని, ఆస్తుల కేసును హైకోర్టు పరిధిలో విచారించాలని లాయర్ శ్రీరంగరావు గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.

ధర్మానకు హైకోర్టులో ఊరట

మంత్రి ధర్మాన ప్రసాద రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాసిక్యూషన్‌కు అనుమతిని ఇచ్చిన కింది కోర్టు తీర్పును హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలన్న సిబిఐకి కిందికోర్టు ఇటీవల అనుమతించింది. దీనిని ధర్మాన హైకోర్టులో సవాల్ చేశారు. కింది కోర్టు తీర్పును హైకోర్టు తప్పు పట్టింది.

జానా రెడ్డికి ఊరట

జానా రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టి వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+