ఫొటోలు: వియ్యంకుల జోష్ టిడిపిని గట్డెక్కిస్తుందా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వస్తున్నా.. మీకోసం పాదయాత్ర, ఆ తర్వాత విశాఖపట్నం ముగింపు సభ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సభ ద్వారా పాదయాత్ర కదలిక తెలిసి వచ్చింది. చంద్రబాబు, బాలకృష్ణ ప్రదర్శనగా తెలుగుదేశం పార్టీ ముగింపు సభ జరిగింది. ఈ వియ్యంకులు పార్టీని పట్టాల మీద పెట్టి, గట్టెక్కించడానికి నడుం బిగించినట్లు అర్థమవుతోంది. ఇతర నందమూరి హీరోలు సహకరించినా, సహకరించకపోయినా ముందుకు వెళ్లాలనే నిశ్చయంతోనే వారు ఉన్నట్లు కనిపించారు.
చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ శనివారం విశాఖపట్నంలో అట్టహాసంగానే జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు తరలి వచ్చారు. విశాఖపట్నం ఆ రోజు పసుపు మయమైంది. చంద్రబాబులో సభ అట్టహాసం ఆనందాన్ని నింపినట్లే కనిపించింది. అయితే, కొన్ని సమస్యలు మాత్రం ఉన్నట్లు కనిపిస్తూనే ఉన్నాయి.
ముగింపు సభకు ముగ్గురు పోలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ, కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు రాకపోవడం వేలెత్తి చూపినట్లే అయింది. జూనియర్ ఎన్టీఆర్ రారని ముందే ఊహించారు. కానీ, హరికృష్ణ వస్తారని అందరూ ఆశించారు. కానీ, ఆయన గైర్హాజరయ్యారు. కాగా, ఓ వైపు చంద్రబాబు పాదయాత్ర సాగిస్తుంటే మరో వైపు పార్టీ శాసనసభ్యులు ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లారు.

పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసుకుని హైదరాబాద్ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం చెబుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ నగర నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ చిత్రంలో ఉన్నారు.

హైదరాబాద్ ఊరేగింపులు వియ్యంకులు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ

హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా..

చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు శనివారం తరలి వచ్చిన కార్యకర్తలు..

చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన తారకరత్న ఇలా.. బాలయ్యతో పాటు ఆయన విశాఖపట్నం వచ్చారు..

విశాఖపట్నంలో బాలకృష్ణ ఇలా..

శనివారంనాడు విశాఖలో చంద్రబాబు, బాలకృష్ణ

విశాఖ పైలాన్ వద్ద చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ జోష్ ఇంకా ఉంది.. ఎన్టీఆర్ వేషధారణలో ఇలా..

చంద్రబాబు నాయకత్వానికి బాలకృష్ణ జైకొట్టారు. ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని, మనందరి నాయకుడు చంద్రబాబేనని ఆయన చెప్పారు.
పోయేవారిని వారి మానానికి వారిని వదిలేసి, పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను చంద్రబాబు భుజాల మీద మోసినట్లే కనిపించారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడమే ధ్యేయంగా ఆయన పాదయాత్ర సాగింది. సమాజంలోని అన్ని వర్గాలవారికి చంద్రబాబు హామీల మీద హామీలు ఇచ్చారు. నిర్దిష్టమైన హామీలనే ఇచ్చారు. చంద్రబాబుకు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అండగా నిలిచాడు. చంద్రబాబే తమ నాయకుడని ప్రకటించారు. చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం తాత్కాలికంగా ఆగిపోయింది. హరికృష్ణ గైర్హాజరు కారణంగానే అది ఆగిపోయిందని భావిస్తున్నారు.
పాదయాత్రను ముగించుకుని హైదరాబాదుకు వచ్చిన చంద్రబాబు, బాలయ్యలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ ఉత్సాహం హైదరాబాదులోనూ కనిపించింది. అయితే, చంద్రబాబు, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీని గట్టెక్కించి, తిరిగి అధికారంలోకి తెస్తారా అనేది కాలం తేల్చాల్సిందే.












Click it and Unblock the Notifications