జగన్, కెసిఆర్ చీడపురుగులు: మోత్కుపల్లి వ్యాఖ్య

కెసిఆర్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారే తప్ప తెలంగాణ కోసం కాదని ఆయన అన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం ఆరాటపడే కెసిఆర్‌తో తెలంగాణ రాదని మోత్కుపల్లి అన్నారు. ఎన్నికల్లో సీట్లు గెలిచాక, వాటిని కెసిఆర్ కాంగ్రెస్‌కు అమ్ముకుంటారని మోత్కుపల్లి అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి జీవితమంతా అవినీతేనని, జగన్ దోపిడీ చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడని మోత్కుపల్లి చెప్పారు. సిబిఐ తనిఖీల్లో దొరికిన రూ.43 వేల కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని నర్సింహులు డిమాండ్ చేశారు.
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది వచ్చారని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.












Click it and Unblock the Notifications