జగన్‌కు నిమ్మగడ్డ మధ్యవర్తి, మరో ఆర్నెలలు: సిబిఐ

అనంతరం సిబిఐ తరఫు లాయరు అశోక్ బాను తన వాదనలను వినిపించారు. ఇందు ప్రాజెక్టు దర్యాఫ్తుకు మరో నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతుందన్నారు. విచారణ పూర్తయ్యాకే తుది ఛార్జీషీటును దాఖలు చేస్తామన్నారు. నిమ్మగడ్డ పైన హవాలా ఆరోపణళు ఉన్నాయని, ఇందూ ప్రాజెక్టు పైన విచారణ కొనసాగుతుందన్నారు. అనేక ఒప్పందాల్లో ఉల్లంఘనలు జరిగాయన్నారు.
రూ.884 కోట్లను జగన్ కంపెనీలలో నిమ్మగడ్డ పెట్టుబడులుగా పెట్టారని, జగన్‌కు, ఇతర కంపెనీలకు మధ్య ఒప్పందాల్లో నిమ్మగడ్డ మధ్యవర్తిత్వం వహించారని చెప్పారు. దర్యాఫ్తుకు ఇంకెంత కాలం పడుతుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని, దర్యాఫ్తుకు మరికొంత సమయం పడుతుందని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు.
ఇందు ప్రాజెక్టు దర్యాఫ్తు పూర్తయ్యాకే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో చెప్పిందని, సిబిఐ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం లేదన్నారు. ఇరువైపుల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పైన రేపు విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications