భూకంపంపై కెసిఆర్‌కు కిరణ్ సవాల్: మండిపడ్డ తెరాస

Etela Rajender and KT Rama Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందన ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్సనమని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. బయ్యారం ఉక్కును విశాఖ ప్లాంటుకు తరలిస్తే భూకంపం వస్తుందని ఇటీవల కెసిఆర్ వ్యాఖ్యానించారు. అందుకు నిన్న కిరణ్ మెదక్ జిల్లాలో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కును విశాఖకే తరలిస్తామని, కెసిఆర్ భూకంపం సృష్టిస్తే ఎదుర్కొనే సత్తా తనకుందని ధీటుగా స్పందించారు.

కిరణ్ వ్యాఖ్యలపై తెరాస నేతలు ఢిల్లీలో మాట్లాడారు. ఇది కిరణ్ అహంకారానికి నిదర్శనమన్నారు. గతంలో అసెంబ్లీలో ఒక్క రూపాయి ఇవ్వనని, ఇప్పుడు బయ్యారం గనులను విశాఖకే తరలిస్తామని ఘాటుగా కిరణ్ వ్యాఖ్యానించారని, ఇది తెలంగాణ ప్రజల గుండెలను మరింత రగిలించాయన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు కిరణ్ ప్రభుత్వం అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆంధ్రా పార్టీలు అన్ని కలిసిపోయాయన్నారు. నిన్న కిరణ్ మంత్రులు, ఎమ్మెల్యేల సాక్షిగా వ్యాఖ్యానించారని, అయినా వారు మాట్లాడక పోవడం విడ్డూరమన్నారు. ఢిల్లీలో పార్లమెంటు ద్వారం వద్ద ఎంపీలను పలకరించే నాథుడే కరువయ్యారన్నారు.

వారి ఆందోళన తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి దీక్షకు పోటీగా కనిపిస్తోందన్నారు. కిరణ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని కెటిఆర్ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి వల్ల విద్యార్థుల భవిష్యత్తు చెడిపోతుందనే విషయంపై చర్చకు సిద్ధమన్నారు.

కెసిఆర్‌ను తట్టుకోగలవేమో కానీ తెలంగాణను కష్టం

తెరాస అధ్యక్షుడు కెసిఆర్ భూకంపాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తట్టుకోగలరేమో కానీ తెలంగాణ ఉద్యమ భూకంపాన్ని మాత్రం తట్టుకోలేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కిరణ్ మొదట తన పార్టీలోని విభేదాలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+