గోదావరి కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పుకొచ్చారు. గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును అందు బాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.
ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో 72 శాతం పనులను పూర్తి చేశామని.. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయన్నారు. పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. రెండేళ్లలో సాగునీటి కోసం రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని.. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేశామని చెప్పుకొచ్చారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని వివరించారు. 1970 నుంచి 1980 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారని చెప్పారు. బ్యారేజ్‌ను ఎన్టీఆర్ ప్రారంభించారని.. 10 లక్షల 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.

పోలవరం పై కీలక ప్రకటన
గోదావరి డెల్టా దేశానికే అన్నపూర్ణగా మారిందంటే కాటన్ చొరవగా చంద్రబాబు వివరించారు. కాగా, బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయినా, కాటన్ దొర విగ్రహాలు పెట్టి గౌరవించుకుంటున్నామన్నారు. నాడు బ్యారేజీ నూతన నిర్మాణానికి మిత్ర కమిటీ సిఫారసు చేసిందని చెప్పారు. 50 ఏళ్లు అయ్యాక గేట్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. 2014లో రూ.32 కోట్లతో 194 గేట్లలో 64 గేట్ల మరమ్మతులు చేశామని వివరించారు. వచ్చే మార్చిలోపు పనులు పూర్తిచేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత తమదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ ను ముంబాయి వెళ్లి పరామర్శించానని.. ఆరోగ్యం కుదుటపడ్డాకే విధుల్లోకి రావాలని పవన్‌కు చెప్పానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications