ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య.!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృత దేహం పోలీసులు గుర్తించారు. నరహంతకుడు రాజ్ కుమార్ కొత్తూరు సమీపంలో మరణించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతని మృత దేహం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఒకే సారి ఆరుగురిని రాజ్ కుమార్ హత్య చేసాడు. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసకుకున్నట్లు చెబుతున్నారు.

రాజ్ కుమార్ హత్యలు చేసిన తరువాత పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణతో పాటుగా బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు. పోలీసులు బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లలో సీసీ కెమేరాలను పరిశీలించారు. కొత్తూరు మండలం పంజర్లలో పాయిజన్ తీసుకొని రాజ్ కుమార్ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృత దేహం పక్కన విషం బాటిల్ ను పోలీసులు గుర్తించారు. ఈ హంతకుడు చేసిన నరమేధంతో రాజ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతూ.. డెడ్ బాడీని గుర్తించారు.

Police identified Shabad Six murders accused Raj Kumar dead body in Kohtur as reports

డెడ్ బాడీ పక్కనే పాయిజన్ సీసా

షాబాద్‌లో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురిని రాజ్ కుమార్ హతమార్చాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నిందితుడు తన భార్య పార్వతి సరిత (30), కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)లను హత్య చేశాడు. అనంతరం చిట్యాల రుక్కమ్మ (65), ఆమె కుమార్తె చిట్యాల లక్ష్మీ (45), మైనర్ బాలిక (17)లను కూడా అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తానే ఆరుగురిని చంపాను.. ఒకచోట ముగ్గురిని, మరోచోట ముగ్గురిని హత్య చేశానని చెప్పాడు. ఘటన తెలిసిన వెంటనే సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడుని పట్టిస్తే రూ 2 లక్షలు రివార్డు ప్రకటించారు. అయితే, ఇప్పుడు రాజ్ కుమార్ పాయిజన్ తీసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు భావిస్తున్నారు. రాజ్ కుమార్ డెడ్ బాడీ పక్కన పాయిజన్ బాటిల్ ఉండటంతో.. ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసుల అధికారికంగా సమాచారం వెల్లడించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+